మంత్రి కొండా సురేఖకు TPCC నోటీసులు..

పరకాల (Parakala) నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్‌తో కొండా సురేఖ ఫ్యామిలీ అలర్ట్ అయింది.

వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత (Konda Susmitha) డైరెక్ట్‌గా గ్రౌండ్‌లోకి దిగారు. పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ బర్త్ డే వేడుకలను కొండా సుస్మిత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయ్యాక రేవంత్ రెడ్డికి కళ్లు నెత్తికి ఎక్కాయా అని కూడా సుస్మిత ప్రశ్నించారు. ఈ సారి పరకాల నుంచి పోటీ చేస్తానని చెప్పడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఇప్పటికే పరకాల అప్‌కమింగ్ MLA అంటూ సోషల్ మీడియాలో సుస్మిత పోస్ట్ కూడా చేశారు.

సుస్మిత చేసిన కామెంట్స్‌పై TPCC సీరియస్ అయింది. మంత్రి సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. మూడు రోజుల్లో మంత్రి సురేఖ సమాధానం చెప్తారా.. లేక తనకేం సంబంధం లేదని సుస్మిత విషయంలో జోక్యం చేసుకోలేనని చెబుతారా అన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్.

Previous articleజూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీపై కిమ్స్ ఆస్పత్రి ప్రకటన
Next articleజిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీపై బొత్స కీలక ప్రకటన