జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీపై కిమ్స్ ఆస్పత్రి ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) భుజానికి సర్జరీ సక్సెస్ అయిందని సికింద్రాబాద్ కిమ్స్‌ ఆసుపత్రి హెల్త్‌ బులెటిన్‌ రిలీజ్ చేసింది. ప్రత్యేక వైద్యనిపుణుల బృందం జూనియర్ ఎన్టీఆర్‌కు ఆర్థోస్కోపిక్‌ సర్జరీ నిర్వహించినట్లు ప్రకటనలో తెలిపింది. ఎన్టీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు వివరించింది. రెండు నుంచి మూడు నెలల్లో జూనియర్ ఎన్టీఆర్‌ పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్‌ భుజానికి గాయమైందని ఆయన కార్యాలయం జూలై 27న ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు డాక్టర్లు 6 నుంచి 8 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలోనే సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ణయించారు. దీంతో ఇవాళ సర్జరీ నిర్వహించారు.
Previous articleఖమేనీ ఖతం.. అమెరికా లక్ష్యం నెరవేరేనా..?