వరల్డ్‌వైడ్‌గా వాట్సాప్ యాప్‌ను ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. దీంతో హ్యాకర్లు వాట్సాప్ యూజర్లే టార్గెట్‌గా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. మీ వాట్సాప్‌లోని ముఖ్యమైన, సున్నితమైన డేటాను సేకరించడానికి హ్యాకర్లు వాట్సాప్‌కు వచ్చే OTPని మార్గంగా ఎంచుకుంటున్నారు.
వాట్సాప్ OTP స్కాంలో భాగంగా.. మీకు మీ ఫ్రెండ్ పేరుతో తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది. “తన నెంబర్ పనిచేయడం లేదని.. వాట్సాప్ అకౌంట్ వేరే ఫోన్‌లో ఉపయోగించేందుకు OTP కోసం నీ ఫోన్ నంబర్ ఇచ్చానని.. ఆ OTPని తనకు పంపించాలని దాని సారాంశం”. కాబట్టి మీకు వేరే నెంబర్ నుండి OTP వస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మనకు తెలియని నెంబర్ నుండి ఎటువంటి మెసేజ్ వచ్చిన స్పందించకపోవడం మంచిది.
అలానే మీ వాట్సాప్ అకౌంట్‌కు టూ-స్టెప్ వెరిఫేకేషన్‌ను ఎనేబుల్ చేసుకోవడం బెటర్. దీని వల్ల అకౌంట్ వెరిఫికేషన్‌కి ప్రత్యేక పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీరు OTP పంపినా పిన్ నంబరు ఉండదు కాబట్టి మీ అకౌంట్‌ను హ్యాక్ చేయలేరు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.