అత్యాశ..అబద్ధాలు..అనుచిత వ్యాఖ్యలు..అహంకారం..అనుభవ రాహిత్యం..వివాదాలు వీటన్నింటికి కేరాఫ్ అడ్రస్ డోనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఓడిపోయే వరకు లెక్కలేనన్ని వివాదాల్లో ఉన్నారాయన. విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరున్న ట్రంప్.. తన పాలనలో కీలకమైన సంస్కరణలు చేశారు. కానీ, వివాదాస్పదుడిగా ఉన్న ముద్రను మాత్రం చెరుపుకోలేకపోయారు. ఆ వివాదాలే ట్రంప్‌ను గద్దెదించే వరకు తీసుకొచ్చాయి.
ఎన్నికల వేళ కరోనా వ్యాపించడం ట్రంప్‌కు శాపంగా మారింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో ట్రంప్ విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అధ్యక్షుడే వాటిని గాలికొదిలేశారు. దీంతోపాటు ట్రంప్ నేరుగా కార్పొరేట్ ఆఫీస్ నుంచి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టారు. ఆయనకు కౌంటీ స్థాయిలో కూడా పాలనపరమైన అవగాహన లేదు. ఆయన ఏ దశలోనూ నేర్చుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఆయన కార్యవర్గంలో ఎవరూ ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్నాళ్లు పనిచేసి బయటకు వెళ్లిన తర్వాత ట్రంప్ లోపాలను ఎత్తిచూపడం ఒక ఆచారంగా మారిపోయింది.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో మినహా ఆయన కార్యకవర్గంలో స్థిరంగా కొనసాగిన కీలక వ్యక్తులు ఎవరూ కనిపించరు. జేమ్స్ మ్యాటిస్ వంటి కరుడుగట్టిన సైనిక జనరల్స్ తలపట్టుకొని వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అంటువ్యాధుల నిపుణుడైన ఆంతోనీ ఫౌచీని తరచూ విమర్శించడం కూడా ట్రంప్‌పై వ్యతిరేకతను పెంచింది. పార్టీలతో సంబంధం లేకుండా అమెరికాలో ఆరుగురు అధ్యక్షుల వద్ద ఫౌచీ పనిచేశారు. ఆయనకు అభిమాన సంఘాలే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు వైట్‌హౌస్‌లో మహమ్మారుల వ్యాప్తి సమయంలో స్పందించే అత్యవసర బృందాన్ని ట్రంప్ 2018లో రద్దు చేశారు. ఆ ఫలితమే ఇప్పుడు అమెరికా అనుభవిస్తోంది.
Your article helped me a lot, is there any more related content? Thanks!