వన్డే వరల్డ్‌కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్నాయి. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడతాయి.
పాయింట్స్ టేబుల్లో టాప్‌లో ఉన్న భారత్.. నాలుగో స్థానంలో నిలువనున్న జట్టుతో సెమీఫైనల్లో తలపడనుంది. పాకిస్థాన్ ముందంజ వేస్తే మాత్రం భారత్ 16న కోల్‌కతాలో సెమీఫైనల్ ఆడుతుంది. న్యూజిలాండ్, అఫ్ఘానిస్థాన్‌లలో ఒక జట్టు సెమీస్‌కు చేరితే మాత్రం భారత్ 15న ముంబైలో తొలి సెమీఫైనల్ ఆడుతుంది.
పాయింట్స్ టేబుల్లో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, అఫ్ఘానిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లు ఆడాక శనివారం (ఎల్లుండి) ఇంగ్లండ్‌ను పాకిస్థాన్ ఢీకొనబోతోంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఎంత రన్‌రేట్ కావాలో ముందే తెలుస్తుంది కాబట్టి ఇంగ్లండ్‌పై ఆ మేరకు రన్‌రేట్‌తో గెలిస్తే సరిపోతుంది.