ఒక్కటే బెర్త్.. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌ జట్లల్లో సెమీస్‌ చేరేదెవరు..?

0
వన్డే వరల్డ్‌కప్‌లో ఒక్క సెమీస్ బెర్త్ కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకున్నాయి. అయితే నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య పోటీ నెలకొంది. న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు ఇప్పటికే ఎనిమిది మ్యాచ్‌లు ఆడాయి. ఈ మూడు జట్లు ఇంకో మ్యాచ్ ఆడాల్సి ఉంది.

పాయింట్స్ టేబుల్లో న్యూజిలాండ్ నాలుగో స్థానంలో ఉంది. ఇవాళ బెంగళూరు వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ తలపడనున్నాయి. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ కంటే మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌ రేసులో న్యూజిలాండ్ ముందుంది. గత వన్డే వరల్డ్‌కప్‌ రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్.. సెమీస్‌ చేరాలంటే.. తమ చివరి మ్యాచ్‌లలో పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ఓడిపోవాలి.
పాయింట్స్ టేబుల్లో అఫ్ఘానిస్థాన్ ఆరో స్థానంలో ఉంది. శుక్రవారం (రేపు) అహ్మదాబాద్‌ వేదికగా అఫ్ఘానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు ఢీకొనబోతున్నాయి. అఫ్ఘానిస్థాన్ సెమీస్‌ చేరాలంటే.. పాకిస్థాన్, న్యూజిలాండ్ తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా‌పై అఫ్ఘానిస్థాన్ విజయం సాధించాలి.
పాయింట్స్ టేబుల్లో పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. న్యూజిలాండ్, అఫ్ఘానిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లు ఆడాక శనివారం (ఎల్లుండి) ఇంగ్లండ్‌ను పాకిస్థాన్ ఢీకొనబోతోంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే.. ఎంత రన్‌రేట్‌ కావాలో ముందే తెలుస్తుంది కాబట్టి ఇంగ్లండ్‌పై ఆ మేరకు రన్‌రేట్‌‌తో గెలిస్తే సరిపోతుంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleతెలంగాణ కాంగ్రెస్‌‌ దూకుడు.. బీఆర్ఎస్‌కు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి స్కెచ్
Next articleWorld Cup: మరోసారి భారత్ Vs పాకిస్థాన్‌.. కానీ ఇలా జరిగితేనే..!