గ్రామాన్ని దత్తతు తీసుకున్న ప్రభాస్.. తక్షణమే ఎన్ని కోట్లు ఇచ్చారంటే..

8
గ్రీన్ ఇండియా‌ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌కి దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే గ్రామంలోని అర్బన్‌ బ్లాక్‌ని హీరో ప్రభాస్‌ దత్తత తీసుకున్నారు. దీనిని అటవీ శాఖమంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌తో కలిసి యంగ్‌ రెబల్‌ స్టార్‌ పరిశీలించారు. అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుకు శంకుస్థాపన చేసిన బాహుబలి అక్కడ మొక్కలు నాటారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.
దుందిగల్ దగ్గరలో ఉన్న ఖాజిపల్లి అనే ఈ గ్రామంలోని అర్బన్ బ్లాక్ ని దత్తత తీసుకున్నారు ప్రభాస్. నిజానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ సూచిస్తే అక్కడ..వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ వెల్లడించారు. అయితే ఈ గ్రామాన్ని ఎంపీ చూపించారా లేక ప్రభాస్ సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి  ఉంది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధేశ్యామ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీకి రాధాకృష్ణ డైరెక్టర్. 1920 ప్యారిస్ బ్యాగ్రౌండ్‌తో సాగే సీన్‌ల‌కు సంబంధించిన షూటింగ్‌కు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌వుతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మ‌రో బిగ్ ప్రాజెక్ట్ లో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఆ త‌ర్వాత బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓంరౌత్ డైరెక్ష‌న్‌లో ఆదిపురుష్ అనే భారీ సినిమాలో రాముడిగా ప్ర‌భాస్ న‌టించనున్నారు.
Previous article24 గంటలు కూడా కాకముందే ట్రెండింగ్‌లోకి గంగవ్వ..
Next articleమనసు మమత సీరియల్ నటి సూసైడ్.. అతని వేధింపుల వల్లే..

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here