బిగ్‌బాస్ సీజన్-4 గ్రాండ్‌గా మొదలైంది. సందడి చేయడానికి 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరిలో ఎవరికి ఎక్కువ మద్దతు ఉందన్న విషయంపై సోషల్‌మీడియా ద్వారా లెక్కలు వేస్తున్నారు. దీనిలో గంగవ్వకే తమ ఓటని నెటిజన్లు కామెంట్లు, లైకులు చేస్తున్నారు. 24 గంటలు కూడా కాకముందే గంగవ్వ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
స్టార్ మా ఫేస్‌బుక్ పేజ్‌లో బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వారి ఫొటోలు ఒక్కొక్కటిగా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలకు వచ్చిన లైకుల ఆధారంగా ఏ కంటెస్టెంట్‌కు ఎక్కువ మద్దతు ఉందో, ఎవరు గెలిచే చాన్స్ ఉందో అంచనా వేస్తున్నారు. ఇలా పోల్చి చూసినప్పుడు గంగవ్వకు ఎవరూ పోటీ ఇవ్వలేకపోతున్నారు. గంగవ్వకు ఇప్పటివరకు ఏకంగా 24 వేల లైక్స్ వచ్చాయి. కానీ ఇతర కంటెస్టెంట్లకు గంగవ్వకు ఉన్న మద్దతులో సగం కూడా రాలేదు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com