GHMC మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. మేయర్ కుటుంబసభ్యులకు మాత్రం కొవిడ్-19 నెగెటివ్‌గా వచ్చింది.
ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు చేస్తున్నారు.
గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. అయితే తాజాగా విధుల నిర్వహణకు వెళ్లిన సమయంలో ఓ టీ దుకాణంలో మేయర్ ఛాయ్ తాగారు. టీ దుకాణం నిర్వాహకుడికి కరోనా సోకిందని తెలియడంతో మేయర్‌కు మూడో సారి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com