మృతదేహాల ద్వారా కరోనా వ్యాపిస్తుందా.. ICMR ఏం చెప్తోంది..?

2
కరోనా మృతదేహాల విషయంలో భయపడాల్సిన పని లేదని వైద్యనిపుణులు చెప్తున్నారు. కొవిడ్ ప్రధానంగా డ్రాప్‌లెట్ వైరస్ అంటే తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. చనిపోయిన వారు తుమ్మడం, దగ్గడం లాంటివి చేసే అవకాశం లేదు కాబట్టి కరోనా వ్యాప్తికి అవకాశమే లేదు.
ICMR మార్గదర్శకాల ప్రకారం.. మార్చురీ బ్యాగ్ జిప్‌ను ముఖం వరకూ తీయొచ్చు. కుటుంబసభ్యులు, బంధువులు వారిని చివరిసారి చూడొచ్చు.
మృతదేహాన్ని తాకకుండా చేసే తంతు ఏదైనా నిర్వహించుకోవచ్చు.
మృతదేహానికి స్నానం చేయించడం, ముట్టుకోవడం మాత్రం నిషేధం.
దహనం చేస్తే గనుక మర్నాడు అస్థికలను నిరభ్యంతరంగా సేకరించుకోవచ్చు. వాటిలో వైరస్ ఉండే అవకాశమే లేదు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకాలగర్భంలో కలిసిపోనున్న చారిత్రక భవనం.. కూల్చివేయనున్న సర్కార్
Next articleరెండు సార్లు నెగెటివ్.. మూడోసారి లక్షణాలు లేకున్నా పాజిటివ్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here