జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థులపై క్లారిటీ

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నిక బరిలో 58 మంది నిలిచారు. మొత్తం 211 మంది నామినేషన్లు దాఖలు చేయగా… పరిశీలన అనంతరం 81 మంది అర్హులుగా తేలారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 23 మంది పోటీ నుంచి తప్పుకొన్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BJP, భారత రాష్ట్ర సమితి (BRS)ల నుంచి నవీన్‌యాదవ్, లంకాల దీపక్‌రెడ్డి, మాగంటి సునీత బరిలో ఉన్నారు. ఇతర గుర్తింపు ఉన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 55 మంది పోటీలో కొనసాగుతున్నారు.
నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల వాసులు పలువురు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ.. చివరి రోజున ఉపసంహరించుకున్నారు.
అభ్యర్థుల లెక్క తేలడంతో అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్లు లెక్కిస్తారు.
Previous articleబస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య
Next articleబాలకృష్ణ బ్లాస్టింగ్‌ రోర్‌ చూశారా..