బస్సు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 21 మంది వరకు స్వల్ప గాయాలతో బయటపడినట్లు, ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
✳️ ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని రాష్ట్ర అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు.
❇️ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఫోన్ నంబర్లు 99129 19545, 94408 54433 ద్వారా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
❇️ ప్రమాదంలో మృతుల గుర్తింపు, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గద్వాల్ కలెక్టర్, ఎస్పీలు అక్కడే అందుబాటులో ఉండి బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని ఆదేశించారు.
❇️ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు జెన్‌కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Previous articleమంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
Next articleజూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థులపై క్లారిటీ