ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. కానీ నిజంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 7 ఓటములతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో ఉన్న CSK ఖాతాలో కేవలం ఆరు పాయింట్లే ఉన్నాయి. దీంతో ఈసారి ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైన పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పుడు ధోనీ సేన మిగిలిన నాలుగు మ్యాచ్‌లను గెలవాల్సిందే. అప్పుడు ప్లేఆఫ్స్‌కు కనీస అర్హతైన 14 పాయింట్లతో ఉంటుంది. అయితే అంతకన్నా ముందు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలాగే CSK 14 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్ కూడా కీలకంగా మారుతుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్ కేవలం 12 పాయింట్లు సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరింది. దీంతో CSKకు ఇప్పటికీ ద్వారాలు మూసుకుపోలేదనే చెప్పాలి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com