తెలంగాణ రక్షణ సేన (TRS) హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ ఆకాశ్ కొల్లూరు పేరును ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అబ్జర్వర్, కో ఆర్డినేటర్‌గా పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిట్నేని రఘును నియమించారు.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ గ్రాడ్యుయేట్ MLC స్థానం నుంచి బీసీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్‌కు అవకాశం ఇచ్చిన కవిత.. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలోనూ బీసీ అభ్యర్థికే అవకాశం ఇచ్చారు.

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు స్ట్రాటజీ, వార్ రూమ్ ఇన్‌ఛార్జ్‌గా ప్రముఖ న్యాయవాది రామ్ కల్యాణ్ చల్లను నియమించారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ ఛార్జీలను కూడా కవిత ప్రకటించారు.
* హైదరాబాద్ – సురభి, మతీన్, బండారి మహేందర్ ముదిరాజ్
* రంగారెడ్డి – అర్చనా సేనాపతి
* మహబూబ్ నగర్ – రంజిత్ గొంగళ్ల
* నల్గొండ – సుజిత్
* ఖమ్మం – గట్టు కరుణ
* వరంగల్ – మాడుగుల రాజిరెడ్డి
హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థిగా ప్రకటించిన ఆకాశ్ కొల్లూరు హైదరాబాద్ వాసి. నేషనల్ మీడియాలో రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుగా సేవలందిస్తున్నారు. ఇండియా టుడే, రిపబ్లిక్ టీవీ, CNN న్యూస్ 18, డెయిలీ హంట్ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు.