రేపటి నుంచే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌‌ స్థానంలో..

0
టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ‍ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌తోనే ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్‌ కోచ్‌ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. రాహుల్‌ ‍ద్రవిడ్‌‌ కోచ్‌గా కొనసాగేది లేనిది ఇంకా తేలలేదు. దీంతో ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
మరోసారి కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్‌ వరల్డ్‌కప్‌ అనంతరం​ప్రకటించాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ద్రవిడ్‌ రెండో దఫా కోచ్‌గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్‌ భారత జట్టు హెడ్‌ కోచ్‌ పదవి రేసులో ముందు వరుసలో ఉంటాడు.
గత రెండేళ్లలో ద్రవిడ్‌ అందుబాటులో లేని కొన్ని సిరీస్‌లకు లక్ష్మణ్‌ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్‌కు సైతం వీవీఎస్‌ బాధ్యతలు తీసుకున్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ రేపు విశాఖపట్నంలో జరుగుతుంది.
26న రెండో టీ20 తిరువనంతపురంలో, 28న మూడో టీ20 గౌహతిలో, డిసెంబర్ 1న నాలుగో టీ20 నాగపూర్‌లో, డిసెంబర్ 3న ఐదో టీ20 బెంగళూరులో జరగనుంది. ఐదు టీ20ల సిరీస్‌‌లో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ, రుతురాజ్ గైక్వాడ్‌కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. రేపు ప్రారంభం కానున్న ఐదు టీ20 సిరీస్‌‌లో మొదటి మూడింటికి గైక్వాడ్ వైస్ కెప్టెన్ అయితే, నాలుగు, ఐదు మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleరేపటి నుంచే పెళ్లిల సీజన్ ప్రారంభం.. రూ.4.74 లక్షల కోట్ల వ్యాపారం!
Next articleబీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. హరీష్ రావు కామెంట్స్‌తోనే రైతుబంధు‌కు బ్రేక్