Jaanvi: హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న మహేశ్ బాబు కోడలు..

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసురాలు జాన్వి స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. కృష్ణ మనవరాలు, మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి.. మంజుల-సంజయ్ స్వరూప్‌ల కుమార్తె.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానం కలిగిన ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరకు పరిచయం కాబోతున్నారు. నటశేఖర కృష్ణ మనవరాలు.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు మేనకోడలైన జాన్వి స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ గుడ్ న్యూస్ వెల్లడించింది. కృష్ణ కూతురు, నటి-దర్శకురాలు మంజుల ఘట్టమనేని, నిర్మాత సంజయ్ స్వరూప్‌ల కూతురే జాన్వి. తాజాగా విడుదలైన జాన్వి ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పసుపు రంగు టాప్, ఆకుపచ్చ ప్యాంట్‌తో ఆమె లుక్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

నటన కొత్తేమీ కాదు

నిజానికి జాన్వికి నటన కొత్తేమీ కాదు. గతంలో 2018లో తన తల్లి మంజుల దర్శకత్వం వహించిన చిత్రం మనసుకు నచ్చిందిలో జాన్వి ఒక చిన్న పాత్రలో కనిపించారు. అయితే ఈసారి పూర్తిస్థాయి హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. తాత కృష్ణ, మామయ్య మహేశ్ బాబుల బాటలో నటిగా రాణించాలని ఆమె వస్తున్నారు.

తొలి సినిమా వివరాలు

జాన్వి తొలి సినిమా వివరాలు, దర్శకుడు, హీరో వంటి ఇతర విశేషాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఘట్టమనేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Previous articleఅందరం టీమ్‌గా పనిచేశాం.. మరో రెండు రోజులు ఇలానే చేద్దాం
Next articleమొంథా తుఫాన్ ప్రభావంపై CM రేవంత్ రెడ్డి ఆరా