మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం పలు సూచనలు చేశారు.
తుఫాన్ రాకముందే నష్ట నివారణ చర్యలు చేపట్టామని.. అందరం టీమ్‌గా పనిచేశామన్నారు చంద్రబాబు. కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు సీఎం. మరో రెండు రోజులు ఇలానే పనిచేస్తే.. ఇబ్బంది లేకుండా అవుతుందని చెప్పారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ఆదేశించారు.
చెట్లు కూలినా, కరెంట్ వైర్లు తెగిపడినా యుద్ధ ప్రాతిపదికన తొలగించారని.. మున్సిపాలిటీల్లో డ్రెయిన్ల శుభ్రం వల్ల ముంపు బారిన పడకుండా చేశామన్నారు.