Rashmika: పిల్లల కోసం ప్లానింగ్.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇటీవలే విజయ్ దేవరకొండతో రష్మికకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది. ఈ క్రమంలో పిల్లలు, కుటుంబానికి సంబంధించిన రష్మిక చేసిన కామెంట్స్ వైరల్‌గా మారింది. రష్మిక ఏమన్నదంటే..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కొత్త చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ ప్రమోషన్స్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నటీనటులకు కూడా ఆఫీస్ టైమింగ్స్ లాగా పనివేళలు ఉండాలని ఆమె అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది. “ఓవర్‌వర్క్‌ చేయడం గొప్ప విషయం కాదు. మన శరీరం, మనసు విశ్రాంతి కోరుకుంటాయి. రోజుకు 8-10 గంటల నిద్ర భవిష్యత్తులో మన ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది. నేను కూడా నా కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నాను” అని ఆమె తన కోరికను వ్యక్తం చేశారు.
పిల్లల కోసం ఇప్పటి నుంచే ప్లానింగ్
తన భవిష్యత్తు, ముఖ్యంగా పిల్లల గురించి రష్మిక భావోద్వేగంగా మాట్లాడారు. “నేను ఇంకా తల్లిని కాలేదు. కానీ భవిష్యత్తులో నాకు పిల్లలు పుడతారని తెలుసు. వారికి మంచి జీవితాన్ని, భద్రతను ఇవ్వాలనుకుంటున్నాను. దాని కోసం నేను ఇప్పటి నుంచే శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని ఆలోచిస్తున్నాను” అని అన్నారు.
తన భవిష్యత్తు ప్రణాళికపై
‘‘20-30 ఏళ్ల వయసులో కష్టపడి పనిచేయాలి. 30-40 ఏళ్ల మధ్యలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సాధించాలి. 40 తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు, కానీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం’’ అని రష్మిక తెలిపింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించగా, నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భవిష్యత్తుపై ఇంత స్పష్టమైన ప్రణాళికతో ఉన్న రష్మిక మాటలు విని అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
Previous articleమొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
Next articleఅందరం టీమ్‌గా పనిచేశాం.. మరో రెండు రోజులు ఇలానే చేద్దాం