జీవో 111 రగడ: NGT ఆదేశాలు.. కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చిన రేవంత్ రెడ్డి

0
తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్.. కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వచ్చి 24 గంటలు గడిచినా.. టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ 111 జీవోను ఉల్లంఘించి 25 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్‌హౌస్ నిర్మించారని ఆరోపించారు.
వట్టినాగులపల్లి నుంచి గండిపేటకు నీరు వచ్చే కాలువను పూడ్చి, తన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌కు రోడ్డు వేసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కేటీఆర్‌ 111 జీవోను ఉల్లంఘించడంపై గ్రీన్‌ట్రిబ్యునల్‌‌లో ఫిర్యాదు చేశామని.. 8 మంది అధికారులతో గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీ వేసిందన్నారు.
మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్‌హౌస్ ముట్టడి కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని గతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్‌హౌస్ కట్టుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని విమర్శించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleసెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
Next articleNGT నోటీసులపై కేటీఆర్ రియాక్షన్.. రేవంత్ రెడ్డికి మంత్రి కౌంటర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here