అలర్ట్: ఈ 11 యాప్స్‌ను వెంటనే తొలగించండి.. యూజర్స్‌కు గూగుల్ సూచన

23
అత్యంత ప్రమాదకరమైన జోకర్ మాల్ వేర్ పట్టుకున్న 11 యాప్స్‌ను తాము ప్లే స్టోర్ నుంచి తొలగించామని గూగుల్ తెలిపింది. ఎవరి స్మార్ట్ ఫోన్లలోనైనా ఈ యాప్స్ ఉంటే, వాటిని వెంటనే డిలీట్ చేయాలని గూగుల్ కోరింది. గత సంవత్సరం చివర్లో జోకర్ వైరస్‌ను గుర్తించామని, ఇది ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తోందని స్పష్టం చేసింది. ఇది యాప్స్‌లో దాగుండి, స్మార్ట్ ఫోన్లలోకి ఇతర వైరస్‌లను ఎవరి ప్రమేయం లేకుండానే డౌన్‌లోడ్ చేస్తోందని, దీని కారణంగా ఎన్నో ప్రీమియం యాప్స్ ప్రమాదంలో పడ్డాయని గూగుల్ తెలిపింది.
మొత్తం 11 యాప్‌లను తాము డిలీట్ చేశామని చెబుతూ, వాటిల్లో ఇమేజ్ కంప్రెస్, రిలాక్సేషన్, యాండ్రాయిడ్ ఎస్ఎంఎస్, చెర్రీ, సెండ్ ఎస్ఎంఎస్, లవింగ్ లవ్ మెసేజ్, విత్ మీ, హెచ్ఎం వాయిస్, ఫ్రెండ్స్ ఎస్ఎంఎస్, రికవరీ ఫైల్స్, ఎల్ ప్లాకర్, రిమైండ్ మీ, మెమొరీ గేమ్ ట్రయినింగ్ వంటి యాప్స్ ఉన్నాయని వెల్లడించింది.
కాగా, తనను గుర్తించకుండా ఉండేందుకు ఈ వైరస్ పాత టెక్నిక్ లను వినియోగిస్తోందని, రెండు మార్గాల ద్వారా స్మార్ట్ ఫోన్లలోకి ప్రవేశిస్తోందని రీసెర్చర్లు వెల్లడించారు. ప్లే స్టోర్ సెక్యూరిటీని దాటి మరీ ఇది యాప్స్‌కు పట్టుకుందన్నారు. ఈ వైరస్‌ను తయారు చేసిన వారు దాని కోడ్‌ను తగ్గించారని, అది కూడా ‘డెక్స్’ ఫైల్ రూపంలో ఉండి, గుర్తించేందుకు క్లిష్టతరంగా మారిందని తెలిపారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఅడవిబిడ్డల ఆశాదీపం.. కొండకోనలు దాటిన ఆత్మవిశ్వాసం సీతక్క
Next articleబిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా ఎలా సోకింది..?

23 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here