బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా ఎలా సోకింది..?

7
బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. మార్చి 23న లాక్‌డౌన్ ప్రారంభించిన రోజు నుంచి ఆయన ఇంటికే పరిమితం అయ్యారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు వీడియోలు రూపొందించారు. ఇంట్లోనే ఉంటూ చిరంజీవి, మమ్ముట్టి, రజనీకాంత్ తదితరులతో కలిసి ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించారు.
వాస్తవానికి లాక్‌డౌన్ సడలింపులు ప్రారంభమైన తరువాత, అమితాబ్ ఇంటి నుంచి బయటకు వచ్చారు. తాను హోస్ట్‌గా వ్యవహరించాల్సిన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ సెలెక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తరువాత అమితాబ్ పాల్గొన్న కార్యక్రమం ఇదే. అక్కడికి వచ్చిన వారిలో ఎవరికో వైరస్ ఉండి ఉండవచ్చని, వారి నుంచే అమితాబ్‌కు సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. వారిలో ఎవరికి వైరస్ ఉందన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఅలర్ట్: ఈ 11 యాప్స్‌ను వెంటనే తొలగించండి.. యూజర్స్‌కు గూగుల్ సూచన
Next articleఆ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా.. అత్యద్భుమైన మ్యాచ్ మాత్రం చూశారు

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here