9 గంటల పాటు ఆకాశవాణి భవన్‌ దగ్గర రాహుల్ గాంధీ నిరసన

ఎన్నికల ప్రధాన కమిషనర్‌- CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాతో పాటు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (SIR) రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండి కూటమి నేతలు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్‌ దగ్గర మంగళవారం ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
దాదాపు తొమ్మిది గంటల పాటు ఆకాశవాణి భవన్ దగ్గరే బైఠాయించిన కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు నేతలు, కార్యకర్తలను రాత్రి 8 గంటల సమయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం ఉదయం పార్లమెంట్ నుంచి ECI ఆఫీస్ వైపు ఇండి కూటమి ఎంపీలు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో ఆకాశవాణి భవన్ దగ్గర బారికేడ్లను అడ్డుపెట్టిన పోలీసులు ఎంపీలను అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ అగ్రనాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా సహా ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించారు. ఆ తర్వాత బారికేడ్లపైకి ఎక్కి జాతీయ జెండా పట్టుకొని రాహుల్ గాంధీ.. నిరసన తెలిపారు. ఆ తర్వాత ఆకాశవాణి భవన్‌లోకి వెళ్లిన రాహుల్‌, ప్రియాంక, పలువురు విపక్ష పార్టీల ఎంపీలు తొమ్మిది గంటల పాటు అక్కడే నిరసన కొనసాగించారు.
Previous articleKCRకు నోటీసులు.. ఎర్రవల్లి భూములపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
Next articleఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ