కష్టానికి ప్రతిరూపం ఆయన..ప్రజల కోసం నడిచొచ్చే సేవకుడు ఆయన..ప్రజా సమస్యల పరిష్కారమే ఆయన ధ్యేయం.. గుండ్లపల్లి అభివృద్ధే ఆయన కర్తవ్యం. ఆయనెవరో కాదు..జనమెచ్చిన నేత..జనహృదయ నేత పెంజర్ల నర్సింలు.. ఆయన ధ్యాసంత ప్రజలకు ఏదో చేయాలని.. ప్రజలను కష్టాల కడలి నుండి ఒడ్డుకు చేర్చాలని.. ఆ తపనతోనే అన్నింటిని వదిలిపెట్టి కేవలం ప్రజల కోసమే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.
ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులకు ఎదురొడ్డి నిలిచాడు నర్సింలు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మిగితా నేతలంతా పలుకుబడి లేదా పేరు కోసం సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే.. ప్రజల కోసమే ఇప్పుడు బరిలో నిలిచిన నాయకుడు నర్సింలు. ప్రజలకు సైతం ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఎన్నికల్లో ఆయన్నే గెలిపిస్తామని అంటున్నారు. సర్పంచ్గా గెలిపిస్తే తన స్వార్ధం కోసం కాకుండా తనను నమ్మిన ప్రజల కోసం ఇప్పటికీ అలుపెరగని కృషి చేస్తానని అంటున్నాడు నర్సింలు.
మీకు పదవులు ముఖ్యమా అని నర్సింలును అడిగితే.. నాకు పదవులు ఎందుకు ప్రజాసేవే చాలంటాడు. అనడమే కాదు దానిని ఆచరిస్తున్నాడు కూడా. నిజమైన నాయకులు ఓట్ల నుంచి కాదు జనం గుండెల్లో నుంచి పుడతారనేది ఓ నానుడి. దానికి నిలువెత్తు నిదర్శనం నర్సింలు. అన్న అని పిలిస్తే తనను నమ్మిన వారికోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధపడతాడు. సామాన్యులకు మంచి జరుగుతుందంటే చాలు అది ఎంత కష్టమైన భరించే నైజం ఆయన సొంతం.
నర్సింలుకు సుధీర్ఘ రాజకీయ అనుభవం లేకపోవొచ్చు.. కానీ ప్రజల సమస్యలను వినే మంచి మనసు ఉంది.. వాటి పరిష్కరించే సేవాభావం ఉంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తన ఊరు అభివృద్ధే ఆయన ధ్యేయం. దాన్ని కోసం అడ్డగోడలన్నింటిని చీల్చుకుంటూ తాను నమ్మిన బాటలోనే నడుస్తున్నాడు నర్సింలు. ఎన్నో ఏళ్లుగా ప్రజల కోసమే శ్రమిస్తూ స్వార్ధ మెరుగని సమాజ సేవకుడిగా పేరుపొందారు.




