రేవంత్ రెడ్డి అరెస్ట్.. డ్రోన్‌ వాడకంపై సీరియస్ రియాక్షన్

25
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మల్కాజ్‌గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వస్తుండగా రేవంత్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రేవంత్‌ను నార్సింగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనుమతి లేకుండా మంత్రి కేటీఆర్ ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారని ఇప్పటికే నలుగురు రేవంత్‌రెడ్డి అనుచరులను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో రేవంత్ సహా 8 మందిపై నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. IPC 184, 187, 11 రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వ జీవోను కాదని మంత్రి కేటీఆర్‌ ఫామ్‌ హౌస్‌‌ను నిర్మించారని మార్చి 2న ఎంపీ రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా జన్వాడలో ఆందోళనకు దిగారు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ ఫామ్ హౌస్‌కు సంబంధించిన విషయంలోనే మరోసారి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous article‘మన ఫ్రెండ్స్ ఎదవలైతే.. మనం ఎదవలవుతాం..’ దుమ్ముదులిపిన రానా
Next articleనీకు ఆ పదవి ఇస్తాం..మాతో కలువు.. ప్రభుత్వాన్ని కూల్చేద్దాం.. అయితే ఒకే

25 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here