నానికి బంపర్ ఆఫర్.. మెగాస్టార్ మూవీకి సంబంధించిన సీక్రెట్స్ చెప్పే ఛాన్స్

0
ఈ నెల 9 నాటికి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై 30 సంవత్సరాలు పూర్తికానుంది. దీంతో ఈ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. దీనికి సంబంధించిన వివరాలను తెలుపుతూ.. వైజయంతి మూవీస్ ట్విట్టర్‌ వేదికగా ప్రకటన చేసింది.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ చరిత్రాత్మక చిత్రానికి సంబంధించిన కొన్ని గొప్ప కథనాల కోసం మీరంతా వెయిట్ చేస్తున్నారా? అయితే నాచురల్ స్టార్ నాని వాటిని మీకు వినిపిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి దాచిపెట్టిన 3 కథనాలను మీకు నాని ఈ నెల 5, 7, 9 తేదీలలో బయటపెడతాడంటూ వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.
చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన క్లాసిక్‌ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’. శ్రీదేవి హీరోయిన్. 1990లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. సూపర్‌ హిట్‌ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇళయరాజా అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వైరస్‌ను అడ్డుకోగలమా?
Next article“బాయ్స్ లాకర్ రూం” గ్రూప్ గుట్టురట్టు.. చాటింగ్ స్క్రీన్ షాట్లపై అమ్మాయి కంప్లైంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here