కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రధాని మోడీ చెప్పిన ఏడు సూత్రాల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా ఒకటి. మొత్తం 11 భాషాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజల్లో కరోనాపై అవగాహన పెంచడం, కరోనా కేసుల్ని నియంత్రించడం ప్రభుత్వ లక్ష్యం.
ప్రధాని పిలుపు తర్వాత ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో ప్రజలు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరోవైపు దీని వల్ల కలిగే ప్రయోజనం ఎంత అన్న చర్చ కూడా సాగుతోంది. ఆరోగ్య సేతు యాప్ ఫోన్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అవుతోంది. ఆ వ్యక్తి కోవిడ్ బాధితుల వద్దకి గానీ, క్వారంటైన్‌లో ఉన్న పాజిటివ్ వ్యక్తి దగ్గరికి గానీ వెళ్లి రెండు నిమిషాలు గడిపితే వెంటనే.. డేంజర్ జోన్‌లో ఉన్నామని అలర్ట్ చేస్తుంది.
చైనా, దక్షిణ కొరియా మినహా ఈ తరహా యాప్ వాడుతున్న భారత్ సహా మిగిలిన దేశాల్లో కేవలం ట్రాకర్‌గానే ఉపయోగపడుతోంది తప్ప మరే విధంగానూ వైరస్‌ని నియంత్రించలేదని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమని తేల్చిచెప్పారు. ఎంత ఎక్కువ మందికి పరీక్షలు చేస్తే అంత త్వరగా కరోనా ముప్పు నుంచి బయటపడొచ్చని వెల్లడించింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com