కేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్‌గా నడ్డా విమర్శలు.. ఏం చేశారో చెప్పాలని డిమాండ్

8
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిన ప్రతీ అంశాన్ని అస్త్రంగా మార్చుకొంటుంది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రమే సర్కార్‌పై విమర్శలు చేస్తుండగా.. తాజాగా BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని నడ్డా ఆరోపించారు. దోచుకోవడం కోసమే రూ. 45 వేల కోట్లకు పూర్తి కావాల్సిన కాళేశ్వరం పనులను రూ. 85 వేల కోట్లకు పెంచారని విమర్శించారు. గత ఆరేళ్లుగా రాష్ట్రానికి CM KCR చేసిందేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ జిల్లా కార్యాలయాలకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న నడ్డా.. కేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్‌గా కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పిన KCR.. నిరుద్యోగులకు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు. ఏడు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారని.. కానీ, 50 వేల నిర్మాణాలు కూడా జరగలేదన్నారు. కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకరోనా టెస్ట్‌లు ఎన్ని రకాలు.. ఏ టెస్ట్ ద్వారా ఫలితం తొందరగా వస్తుంది..?
Next articleరష్యా వ్యాక్సిన్ వచ్చేసింది.. కానీ ఇండియా రియాక్షన్ మాత్రం..

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here