కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అంటున్న నేతలు.. మరి తర్వాత కేసీఆర్ ఏం చేస్తారు..??

2
కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి..? ఇదే మాట ఇప్పుడు టీఆర్ఎస్ నేతల నోట వినిపిస్తోంది. కానీ ఈ చర్చ గత రెండు సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నప్పటికీ.. గత నెలలో సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చాక మాత్రం గులాబీ నేతలు గేర్ మార్చారు.
ఒకవేళ కేటీఆర్ సీఎం అయితే.. మరి కేసీఆర్ పరిస్థితి ఏంటనేది ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. వాస్తవానికి 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేసీఆర్ రాష్ట్రంలో బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించి.. పలు ప్రాంతీయ పార్టీలతో కలిసి ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలనుకున్నారు. అయితే అది అనుకున్నంత ఈజీ కాదని అర్థంకాగానే కేసీఆర్ సైలెంట్ అయ్యారు. దీంతో ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే.. కేసీఆర్ సూపర్ సీఎం స్థానంలో ఉంటారని తెలుస్తోంది.
కేటీఆర్‌ను సీఎం చేశాక సలహామండలి ఏర్పాటు చేసి దానికి చైర్మన్‌గా కేసీఆర్ ఉండే అవకాశముంది. సలహా మండలిలో చైర్మన్‌గా కేసీఆర్, కొత్త సీఎం కేటీఆర్, ఇతర మంత్రులతో పాటు మరికొందరు ముఖ్యులు కూడా ఉంటారని తెలుస్తోంది. ప్రభుత్వం ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే సలహామండలిలో చర్చించిన తర్వాతే డెసిషన్ తీసుకునేలా కేసీఆర్ ప్రణాళిక రచించారని చెప్తున్నారు.
మరోవైపు ఫిబ్రవరి 18న కేటీఆర్‌కు సీఎం పదవిని అప్పగించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో డేట్ ఏదైనా.. కేటీఆర్‌ సీఎం పదవిలో కూర్చోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleKCR కీలక నిర్ణయాలకు బండి సంజయ్ దూకుడే కారణమా..?
Next articleఆకర్ష్ టాస్క్‌లో సక్సెస్‌పుల్‌గా దూసుకెళ్తున్న బీజేపీ..కాంగ్రెస్ బేజారు

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here