కృష్ణ – అరేయ్ అరుణ్ నీకు ట్రైన్ తెలుసారా
అరుణ్ – అదేంటిరా అలా అడుగుతున్నావ్
కృష్ణ – అరే చెప్పురా
అరుణ్ – హా తెలుసు..
కృష్ణ – అవునా ఎలా ఉంటదీ
అరుణ్ – అరేయ్ నీకు వెటకారం బాగా ఎక్కువైందిరా
కృష్ణ – అరేయ్ నిజంరా ఎలా ఉంటుంది..నువ్వు ఎప్పుడైనా ఎక్కావా
అరుణ్ – ఎక్కడం ఏందిరీ..నేను తరుచూ మా ఇంటికి ట్రైన్ లోనే వెళ్తా రా
కృష్ణ – నీకు ఎప్పటి నుంచి ట్రైన్ తెలుసురా
అరుణ్ – నా చిన్నప్పటి నుంచి
కృష్ణ – అప్పటినుంచే ట్రైన్ ఉందారా
అరుణ్ – ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్ రా
కృష్ణ – అరే చెప్పురా అప్పటినుంచే ట్రైన్ ఉందా
అరుణ్ – 140 ఏళ్ల నుండే ట్రైన్స్ ఉన్నాయ్ రా
కృష్ణ – అవునా, నిజమా
అరుణ్ – నిజంరా
కృష్ణ – మరీ అదేందిరా గా కేంద్రమంత్రి గట్లా అన్నాడు
అరుణ్ – ఏం అన్నాడు రా
కృష్ణ – మోడీ రాకముందు తెలుగు వాళ్లకు ట్రైన్లు అంటేనే తెల్వది..ఎర్రబస్సులు మాత్రమే తెలుసు.. మోడీ వచ్చాకే తెలంగాణకు ట్రైన్లు వచ్చాయని అన్నాడు
అరుణ్ – ఏదో హడావిడిలో అలా అనుండొచ్చురా
కృష్ణ – అవునా..పక్కా తెలంగాణ నాయకుడు, సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, పైగా కేంద్రమంత్రి హోదాలో ఉండి అలా అనడం ఏందిరా
అరుణ్ – ఏమోరా మరి..కానీ నిజాం హయాంలోనే రైల్వే లైన్లు పడ్డాయి. ఇంక ఆంధ్రాలో అయితే అంతకుముందు నుంచే ఉన్నాయి. తెలంగాణలో విమాన సర్వీసులు కూడా 70 ఏళ్ళ కిందటే నడిచాయి.
కృష్ణ – ఇప్పుడా ఆ మంత్రి కామెంట్లు నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి తెలుసారా నీకు..
అరుణ్ – ఏమనిరా
కృష్ణ – “కిషన్‌రెడ్డిగారూ.. రైలు పట్టాలు ఇనుపయి కదా! అటొక్కటి ఇటొక్కటి పెట్టి.. వాటి మింకెల్లి రైలు నడుపుతరా? మాకు ఇవ్వారకు తెల్వనే తెల్వది”
“నిజాం కాలంలో కూడా ప్రధానిగా నరేంద్రమోదీయే ఉండి.. రైల్వే లైన్లు వేయించారు. మోదీ లేకుంటే దేశంలో ఏ పనీ జరిగి ఉండేది కాదు”
“మోదీ రాకముందు తెలంగాణలో రోడ్లు, బిల్డింగులు లేనేలేవని ఆయన అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.”
ఇంకా ఇట్లాంటియి చాలా ఉన్నాయిరా…
అరుణ్ – రాజకీయాలు, రాజకీయ నాయకుల మాటలు గట్లనే ఉంటాయ్ వదిలేయ్ రా
కృష్ణ – అంతేనంటవా
అరుణ్ – అంతేరా, పదా మన పని మనం చేసుకుందాం..
కృష్ణ – సరే పదా..
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.