గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ దూకుడు కొనసాగిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని కూడా జనసేన పార్టీ ప్రకటించింది.ఈ క్రమంలో ప్రచారానికి సంబంధించిన జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ ప్రచారం రథాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్  హైదరాబాద్‌లో  ప్రారంభించారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా డా. గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ, పలు సూచనలు చేశారు పవన్ కల్యాణ్.

ఈ గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్ కేవలం ఎన్నికల ప్రచార వాహనంగా కాకుండా, యువత సమస్యలను నిరంతరం తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Previous articleరైతులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Next articleసీఎం రేవంత్ రెడ్డితో హ్యూందాయ్ ప్రతినిధి బృందం భేటీ