అలా జరిగితే రూ.5లక్షలు.. ఎకరానికి రూ.10వేలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..

Revanth Reddy
Revanth Reddy
మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రజలను, రైతులను అన్ని విధాల ఆదుకుంటామని సీఎం రేవంత్ తెలిపారు. తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో భారీగా పంట, ఆస్తి నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో వరదల పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో తుఫాన్ బాధితులకు భారీగా పరిహారం ప్రకటించారు. ఈ మేరకు గతంలో ఇచ్చిన జీవో ప్రకారం పరిహారాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

పరిహారం ఇలా..

  • మనుషులు మృతిచెందితే  – రూ. 5 లక్షలు
  • ఇల్లు మునిగిన వారికి  – రూ. 15,000
  • గుడిసెలు కోల్పోయిన వారికి – ఇందిరమ్మ ఇల్లు
  • ఎకరం పంట నష్టానికి  – రూ. 10,000 చొప్పున
  • ఆవులు, గేదెలు మృతి చెందితే – రూ. 50,000 చొప్పున
  • మేకలు, గొర్రెలు మృతి చెందితే – రూ. 5,000 చొప్పున

కేంద్ర నిధులపై సీఎం

తుఫాన్ వల్ల జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సీఎం స్పష్టం చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన నివేదికలను కూడా కలెక్టర్లకు పంపి, అన్ని నివేదికలను సమీకరించి కేంద్రానికి నివేదించాలన్నారు. “కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గట్టిగా చెప్పారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాన్ నష్టాన్ని అంచనా వేసి బాధితులకు త్వరగా పరిహారం అందజేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Previous articleకెమెరా ముందుకు బాలయ్య చిన్న కూతురు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
Next articleఇద్దరిని పిలిచి మాట్లాడాలన్న సీఎం.. నివేదికపై ఉత్కంఠ