ఇద్దరిని పిలిచి మాట్లాడాలన్న సీఎం.. నివేదికపై ఉత్కంఠ

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇద్దరితో మాట్లాడాలని TDP క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 4న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని ఎమ్మెల్యే కొలికపూడికి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని ఎంపీ చిన్నికి సమాచారం అందించింది. అనుచరులతో కాకుండా విడివిడిగా రావాలని ఆదేశించింది.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఇప్పటికే చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన CBN.. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య బహిరంగంగా విమర్శలపై చర్చించారు.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు.. పలు అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కొలికపూడి, కేశినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని, వారి నుంచి పూర్తి వివరణ తీసుకుని తనకు నివేదిక సమర్పించాలని క్రమశిక్షణ కమిటీకి సూచించారు. తాను విదేశీ పర్యటన ముగించుకుని వచ్చాక స్వయంగా ఇద్దరితోనూ మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవాళ లండన్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు తిరిగి వచ్చాక.. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇద్దరు నేతల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ జరుగుతోంది.
Previous articleఅలా జరిగితే రూ.5లక్షలు.. ఎకరానికి రూ.10వేలు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన..
Next articleకాశీబుగ్గ ఘటనపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు