దసరా పండుగ శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పారు సీఎం చంద్రబాబు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ మనకు గొప్ప స్ఫూర్తిని ఇస్తుందన్నారు. రైతన్న శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు మంచి భవిష్యత్తు అందించేందుకు తాము చేస్తున్న సంకల్పానికి ఆ జగన్మాత అనుగ్రహం లభించాలని ప్రార్ధిస్తున్నాను అన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని సీఎం పోస్ట్ చేశారు.

Previous articleఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం- సీఎం చంద్రబాబు
Next articlePragyan Ojha replaces Ajit Agarkar