BRS అధినేత, మాజీ సీఎం KCR ప్రతిష్ఠను దెబ్బతీసేలా, కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది.
BRS జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ ఈ నోటీసులు పంపించారు. ఇదే అంశంపై ఇప్పటికే వెలుగు పేపర్ యాజమాన్యం, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేసింది.
క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు
24 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే పరువునష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే అదేవిధంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలకు కూడా నోటీసులు పంపించారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని BRS లీగల్ సెల్ స్పష్టం చేసింది.
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని, నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం దావా సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.