బాలకృష్ణ బ్లాస్టింగ్‌ రోర్‌ చూశారా..

నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్‌ ఇండియా మూవీ ‘అఖండ 2: తాండవం’. ఇది వీళ్లిద్దరి నుంచి వచ్చిన విజయవంతమైన సినిమా ‘అఖండ’కు కొనసాగింపుగా తెరకెక్కింది. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ నెలకొంది. మేకర్స్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ డిసెంబరు 5న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే బ్లాస్టింగ్‌ రోర్‌ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు.
సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్‌కి నరుకుతానో నాకే తెలియదు.అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ టీజర్‌కు ఆకర్షణగా నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Click Here: Thaman Tweet

Previous articleజూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థులపై క్లారిటీ
Next articleకర్నూలు బస్సు ప్రమాదానికి కారణమిదే!