ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడే పోటీ

త్వరలోనే AP స్థానిక సంస్థల ఎన్నికలకు EC షెడ్యూల్‌ ప్రకటించనుంది. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై NDA కూటమి స్పెషల్ ఫోకస్ పెట్టింది. CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉదయం 9.30 నుంచి దాదాపు రెండు గంటల పాటు సీఎం, డిప్యూటీ సీఎం భేటీ కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహం, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం సీట్లు కూటమి గెలిచి తీరాలని, సీట్ల సర్దుబాటు కూడా దానికి తగ్గట్టే ఉండాలని, ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీ చేయాలన్న దానిపై చర్చ జరిగినట్టు సమాచారం. జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్ల లిస్ట్‌ను పవన్‌ కల్యాణ్‌ సీఎంకు అందజేశారని తెలిసింది.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై కూడా సీఎం, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగినట్టు తెలిసింది.
పవన్‌తో భేటీ తర్వాత.. AP TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడితో సీఎం సమావేశమయ్యారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో స్పష్టత వచ్చిన వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయడం వంటి కసరత్తు వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
Previous article9 గంటల పాటు ఆకాశవాణి భవన్‌ దగ్గర రాహుల్ గాంధీ నిరసన
Next articleటీమిండియా కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధన