బీఫాంలు వచ్చిన వాళ్లు మాత్రమే పోటీ చేయాలి

NDA అగ్రనేతల మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియచేసిన ముఖ్యాంశాలు:

* రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బలంగా ముందుకు తీసుకెళ్లాం. ఎన్నో సవాళ్లని సమర్థంగా ఎదుర్కొన్నాం.
* ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు కూడా దేశానికి వస్తున్న 100 శాతం పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ 25 శాతం తీసుకెళ్తోందని చెప్పడం ఆనందం కలిగించింది. పెట్టుబడులకు సానుకూలమైన పరిస్థితి కల్పించిన పాలనను అభినందించారు.
* సాధారణ ఎన్నికల స్థాయిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమైనవి. స్థానిక నాయకత్వం పెంపొందించుకునే అవకాశం ఉన్నవి. సాధారణ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చాలా తేలికగా జరిగింది. ఇప్పుడు చాలా అంశాలను పరిశీలించి
తగిన నిర్ణయం తీసుకోవల్సి వస్తోంది.
* ఇది మూడు పార్టీలకు ఛాలెంజింగ్ అనిపించింది. మూడు పార్టీల పరిధిలో అంచనాలు అధికంగా ఉన్నాయి. చాలా విభిన్నమైన పరిస్థితులు వచ్చాయి. వాటిని అన్ని సానుకూలంగా చర్చించి ఇప్పుడు ఏకాభిప్రాయంతో ఎన్నికలకు వెళ్తున్నాం.
* కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా కిందిస్థాయి లో ఇదే స్ఫూర్తి, ఐక్యతను చాటాలి. బలమైన పునాదులను స్థానిక సంస్థల్లో వేయాల్సిన అవసరం ఉంది.
* కూటమి ప్రభుత్వ వచ్చిన తర్వాత పల్లె పండుగ కార్యక్రమం కింద రూ.20,390 వేల కోట్లతో 16 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 19,500 కిలోమీటర్ల బీటీ రోడ్లతో పాటు , మినీ గోకులాలు, నీటి గుంటలు, పశువుల నీటి తొట్టెలు వంటి పనులు చేయగలిగాం. అలాగే అడవితల్లి బాట రెండు దశల్లో రూ.3,458 కోట్లతో 3,630 కిలోమీటర్ల రోడ్లు, 45 వంతెనలు, 2,199 గిరిజన అవాసాలకు 1,300 రహదారులను పూర్తి చేశాం
* 2047 నాటికి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో రాష్ట్రాన్ని 50 శాతం గ్రీన్ కవర్ చేసేలా పనిచేస్తున్నాం.
* అమరజీవి జలధార పనుల కింద రూ. 30,156 కోట్లతో 50,300 పనుల్ని చేపడుతున్నాం. పథకాన్ని కేంద్రం 2028 సంవత్సరం వరకు పొడిగించింది. దీంతో జల్ జీవన్ మిషన్ పథకంలో 27.36 కొత్త ఆవాసాలకు కనెక్షన్లు ఇచ్చాం. మొత్తంగా రాష్ట్రంలో 3.27 కోట్ల గ్రామీణ ప్రజలకు తాగునీటి వెతలు తీర్చేలా చేయగలిగాం.
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ద్వారా రూ. 1.50 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
* ⁠గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన  రూ.30 వేల కోట్ల నిధులను చెల్లిస్తున్నాం. పేదలకు 60 వేల ఇంటి పట్టాలను ఇచ్చాం. రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు వచ్చాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్, ఏఐ డేటా సెంటర్లను తీసుకురాగలిగాం.
* పోలవరం, హంద్రీనీవా, భోగాపురం విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లగలిగాం. ఈగల్ టాస్క్ ఫోర్సు ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, వాట్సప్ గవర్నెన్స్ 1035 ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందిస్తున్నాం.
* కూటమి అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి వెళ్లాలంటే అంతా ఐక్యంగా పనిచేయాలి.
* ⁠2024 సాధారణ ఎన్నికల్లో 93 శాతం అసెంబ్లీ స్థానాలు ఐక్యంగా ముందుకు వెళ్లి గెలుచుకున్నాం. అలాంటి గెలుపే మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపాలని అన్ని పార్టీల నాయకుల్ని కోరుతున్నాను.
* చాలాచోట్ల నామినేషన్లు ఔత్సాహికులంతా వేశారు. అయితే మూడు పార్టీల నాయకత్వం ఫైనల్ చేసిన లిస్టులోని వారికి మాత్రమే బీఫాంలు అందిస్తాం. మేం బీఫాంలు ఎవరికి ఇస్తామో వారు మాత్రమే బరిలో నిలవండి. మిగిలిన వారికి భవిష్యత్తులో అవకాశాలు ఇస్తాం. కూటమి స్ఫూర్తిని దెబ్బతీయవద్దు.
* ఎన్నికల్లో సూక్ష్మస్థాయిలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే వాటిని సరిదిద్దేలోపే అర్ణబ్ తుపాను రూపంలో విపత్తు రావడం, దాని మీద ప్రత్యేక పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
* ⁠కూటమి నాయకులంతా అర్ణబ్ సహాయచర్యల్లో పాల్గొనండి. దేవుడి దయతో తుపాను వల్ల ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కలగకూడదని ప్రార్థిస్తున్నాను.
* రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేయానికి కూటమి ఎల్లపుడూ కృషి చేస్తుంది. ప్రజలంతా అండగా ఉండాలి.
* స్థానిక సంస్థల్లో ఐక్యంగా కూటమి పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. టీడీపీ, బీజేపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చాం… ఆ దిశగానే క్షేత్రస్థాయిలోనూ అందరూ పని చేయాలి. చాలా మంది పోటీలో ఉన్నా.. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సీట్ల సర్దుబాటు జరిగింది.
* సీఎం చంద్రబాబు తనకున్న సుదీర్ఘ అనుభవంతో సీట్ల సర్దుబాటు విషయంలో చాలా మంచి కసరత్తు చేశారు.
• 22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపాం.
• గ్రామస్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.

Previous articleమా అమ్మమ్మ తెలుగు మాట్లాడతారు