గ్రేటర్ హైదరాబాద్ సహా సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత రణభేరి మోగించనున్నారు. మియాపూర్లోని నరేన్ గార్డెన్స్ వేదికగా రేపు మధ్యాహ్నం రాజధాని రణభేరి సభ నిర్వహిస్తారు.
మూడు కార్పొరేషన్ల నుంచి తరలివచ్చే ముఖ్య నాయకులకు బల్దియా ఎన్నికలపై కవిత దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్ర రాజధానిలో సత్తా చాటడమే ధ్యేయంగా కవిత రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జీలు సహా ముఖ్య నాయకులతో కవిత సమావేశం నిర్వహించారు. రేపటి సమావేశానికి పార్టీ ముఖ్య నాయకులను ఆహ్వానించారు.
మూడు కార్పొరేషన్లు, 300 డివిజన్లలో అభ్యర్థులను బరిలోకి దింపడంతో పాటు.. ఎన్నికల ఎజెండాపై కవిత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.