ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం- సీఎం చంద్రబాబు

ప్రజల నమ్మకాన్ని తమ ప్రభుత్వం వమ్ము చేయలేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ఓర్వలేక YCP నేతలు రోడ్లు కూడా తవ్వుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

గత ప్రభుత్వ విధ్వంసంతో AP బ్రాండ్‌ కోల్పోయాం అన్నారు సీఎం చంద్రబాబు. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నామని వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రజలకు భద్రత, భరోసా కల్పించాం అన్నారు. YCP విధ్వంసం వల్లే కూటమి ఘన విజయం సాధించిందన్నారు. ఎక్కడా లేని విధంగా 94 శాతం స్ట్రైక్‌రేట్‌తో ఘన విజయం సాధించామని చెప్పారు

రూ.లక్షన్నర కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. సంక్షేమ క్యాలెండర్‌ ఫిక్స్‌ చేసి చెప్పిన సమయానికి లబ్ధి చేకూరుస్తున్నాం.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే 55 సేవలపై నిత్యం ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం.. లోపాలు ఉంటే సరిదిద్దుకుంటున్నాం అని చంద్రబాబు చెప్పారు.

Previous articleతప్పుడు ప్రచారంపై BRS సీరియస్.. ముగ్గురు కాంగ్రెస్ నేతలకు నోటీసులు
Next articleదసరా పండుగ శుభాకాంక్షలు