బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులు జరిపిన నిందితులను రాజస్థాన్ కోటాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు షూటర్లు రైలులో ప్రయాణిస్తుండగా కోటా రైల్వే స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కాల్పులకు ముందు రెక్కీ చేసినట్టు తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం జుహు ఫుట్‌బాల్ మైదానానికి వెళ్తాడని తెలుసుకుని దుండగులు ఈ దాడికి ప్లాన్ చేశారని తెలిసింది.
మరోవైపు ఇలాంటి కాల్పులను ఉపేక్షించేది లేదని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిండే స్పష్టం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.