తెలంగాణ కేబినెట్ విస్తరణకు డేట్ ఫిక్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం కేబినెట్లో మూడు మంత్రి పదవులు ఖాళీ ఉండగా.. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఆ తర్వాత మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం ఉంది. అజారుద్దీన్‌కి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదన పంపింది.