దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ECI ఇవాళ సాయంత్రం 4.15 గంటలకు కీలక ప్రకటన చేయనుంది. మీడియా సమావేశం నిర్వహించి.. వివరాలు చెప్పేందుకు ECI ఏర్పాట్లు చేసింది.
2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లో మొదటి విడత SIR చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరిల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు అన్ని రాష్ట్రాల CEOలతో సమావేశం నిర్వహించింది. SIR చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై CEC చర్చించారు.