CJI ఎంపికకు మొదలైన కసరత్తు..

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పదవీ కాలం నవంబరు 23న ముగియనుంది.
ఈ క్రమంలో తదుపరి CJI పేరును సూచించాలంటూ జస్టిస్‌ గవాయ్‌కి కేంద్రం కోరింది. సీజేఐ పదవీ విరమణకు నెల రోజుల ముందుగా తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను ప్రారంభించడం సంప్రదాయంగా వస్తోంది.
సాధారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌ను ఈ పదవి వరిస్తుంది. దీని ప్రకారం జస్టిస్‌ సూర్యకాంత్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే.. 53వ భారత ప్రధాన న్యాయమూర్తిగా నవంబరు 24న ప్రమాణం చేస్తారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు.
జస్టిస్‌ సూర్యకాంత్‌ హర్యానాలోని హిస్సార్‌ జిల్లాలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.
Previous articleవాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు
Next articleమంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..