ఓ వైపు ప్రశ్నలు.. మరోవైపు పర్యటన.. రఘురామకృష్ణరాజు వ్యూహమేంటి..?

1
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం పార్టీలో చర్చకు దారి తీసింది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. దీంతో రఘురామకృష్ణరాజు ప్రశ్నలనే సమాధానంగా పంపారు. తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే అధికారం విజయసాయి రెడ్డికి అసలు ఉందా.. లేదా.. అని ప్రశ్నించారు. వైసీపీలో క్రమశిక్షణ కమిటీ ఉందా? అని ఎంపీ నిలదీశారు.
విజయసాయి రెడ్డి నుంచి తనకు అందిన లేఖపై పలు సందేహాలు లేవనెత్తుతూ వాటిని తీర్చాలని కోరుతూ.. రఘురామకృష్ణరాజు విజయసాయి రెడ్డికే లేఖ పంపారు. అందులో ‘మీ లేఖకు ఇది బదులు మాత్రమే.. సంజాయిషీ కాదు’ అని స్పష్టం చేశారు.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎంపీ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్‌, హోంశాఖ అధికారులను కలిసే అవకాశముందని సమాచారం. నియోజకవర్గ పర్యటన సందర్భంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఎంపీ విజ్ఞప్తిని స్పీకర్‌ అదే రోజు హోంశాఖ కార్యదర్శికి పంపించారు. రఘురామకృష్ణరాజు స్పీకర్‌ను కూడా కలిసే అవకాశముంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleపోస్టింగ్ పంచాయితీ.. తెలంగాణ ప్రభుత్వానికి ఎంపీ రేవంత్ రెడ్డి హెచ్చరిక
Next articleవీడియో వైరల్.. మాహిష్మతిలో ఉన్నా మాస్క్ ధరించాల్సిందే..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here