వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియంలో జరగనుంది. 2003 ఫైనల్ మాదిరే ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా- భారత్ టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఈ వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. అయితే మూడుసార్లు చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో ఏ జట్టూ 300 రన్స్ చేయలేదు.
ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిస్తే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. అయితే ఈ వన్డే వరల్డ్‌కప్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. భారీ స్కోరుతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది.
ఆస్ట్రేలియా- భారత్ జట్లు 13 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 5, ఆస్ట్రేలియా 8 సార్లు గెలిచాయి. చివరగా ఈ వన్డే వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌లో ఆసీస్‌ను 6 వికెట్ల తేడాతో రోహిత్ సేన ఓడించింది.
ఓవైపు ఈ వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌లు గెలవగా.. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచింది. ఈ రెండింటిలో ఏ జట్టు వరుస విజయాలకు ఇవాళ బ్రేక్ పడుతుందో చూడాలి.