వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రెడీ..

మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ యూజర్లు.. తమకు కావాల్సిన కాంటాక్టులు కొత్తగా స్టేటస్ అప్‌డేట్ చేయగానే నోటిఫికేషన్‌ వచ్చేలా ఫీచర్‌ ట్రయల్ దశలో ఉంది. ఈ ఫీచర్‌ను దశల వారీగా రిలీజ్ చేస్తూ యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ పరిశీలిస్తున్నారు.
యూజర్లు తమకు కావాల్సిన కాంటాక్ట్‌ స్టేటస్‌ను ఓపెన్ చేసి పైభాగంలో ట్యాప్‌ చేయాలి. అక్కడ ‘Get Notifications’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత నుంచి ఆ కాంటాక్ట్‌ స్టేటస్‌ అప్‌డేట్ చేసిన ప్రతిసారి యూజర్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది. ఎంపిక చేసిన కాంటాక్ట్‌ స్టేటస్‌ పెట్టినప్పుడు.. వాట్సాప్‌ వెంటనే అలర్ట్‌ పంపుతుంది.
ఆ స్టేటస్‌లో ఇమేజ్‌ లేదా వీడియో ఉంటే నోటిఫికేషన్‌లో చిన్న ప్రివ్యూ కూడా కనిపిస్తుంది. యూజర్లు యాప్‌ ఓపెన్‌ చేయకుండానే కొత్త అప్‌డేట్‌ ఏంటో చూసేయచ్చు..
నోటిఫికేషన్లను ఎప్పుడైనా ఆపేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు తమకు ముఖ్యమైన కాంటాక్టుల అప్‌డేట్లను మిస్‌ కాకుండా చూడొచ్చు.
Previous articleపోటీ నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిశోర్.. కారణమేంటి?
Next articleసీఎం మినహా మంత్రులు రాజీనామా