వాట్సాప్‌‌లో ఐదు ఫీచర్లు..

1
ప్రపంచంలో‌నే పాపుల‌ర్ యాప్ వాట్సాప్ 2020లో ఐదు కొత్త ఫీచ‌ర్లను తీసుకొచ్చింది. వరల్డ్‌వైడ్‌గా 200 కోట్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్న వాట్సాప్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్‌. అంతేకాదు ఈ యాప్‌లో ఏ కొత్త ఫీచ‌ర్ వ‌చ్చినా ముందుగా వాడేది మనోళ్లే. మ‌రి ఈ ఏడాది వాట్సాప్ తీసుకొచ్చిన ఆ 5 ఫీచ‌ర్లు మీ కోసం.
వాట్సాప్ పేమెంట్స్‌:
ప్రస్తుతం ఇండియాలోని 2 కోట్ల మంది యూజ‌ర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI, HDFC, యాక్సిస్ బ్యాంక్‌ల ద్వారా వాట్సాప్ పేమెంట్స్ ప్రస్తుతం ప‌ని చేస్తోంది. అంతేకాకుండా త్వర‌లోనే యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ) వ్యవ‌స్థను కూడా వాట్సాప్ ప్రారంభించ‌నుంది.
డార్క్ మోడ్‌:
ఈ ఏడాది మొద‌ట్లో వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్లంద‌రికీ ఈ ఫీచ‌ర్ అందుబాటులో ఉంది.
డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్‌:
ఈ ఫీచ‌ర్ కూడా యూజ‌ర్లందరికి అందుబాటులో ఉంది. దీనితో వారం తర్వాత ఆ మెసేజ్‌లు ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.
వాట్సాప్ గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్‌:
క‌రోనాతో ప్రపంచం అత‌లాకుత‌ల‌మ‌వుతున్న వేళ ఎంతో మందికి ఉప‌యోగ‌ప‌డే ఈ ఫీచ‌ర్‌ను వాట్సాప్ అప్‌డేట్ చేసింది. గ్రూప్ వీడియో, వాయిస్ కాల్స్ ప‌రిమితిని న‌లుగురి నుంచి 8 మందికి పెంచింది.
గ్రూప్స్‌ను శాశ్వతంగా మ్యూట్ చేసే ఫీచ‌ర్‌:
గ‌తంలో గ‌రిష్ఠంగా ఏడాది కాలానికి గ్రూప్‌ను మ్యూట్ చేసుకునే అవ‌కాశం ఉండేది. కానీ శాశ్వతంగా మ్యూట్ చేసే ఫీచ‌ర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. దీని కోసం ఆల్‌వేస్ ఆప్షన్‌ను అప్‌డేట్ చేసింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleకోట్లలో ఖాతాలు.. సోషల్ మీడియా కొత్త కొత్త రికార్డులు..
Next articleదేవుడు శాసించాడు..తలైవా తగ్గాడు..ఇది ఫిక్స్..

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here