వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. ఇవాళ్టి నుంచి భక్తుల దర్శనాలకు భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
స్వామి వారికి భక్తులు సమర్పించే ఆర్జిత సేవలైన కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేశారు.
ఆలయాన్ని మరింత సుందరంగా, విశాలంగా తీర్చిదిద్దే ఈ ఆలయ అభివృద్ధిలో భాగంగా తీసుకున్న ఈ ముఖ్య నిర్ణయాన్ని భక్తులందరూ గమనించి సహకరించాలని ఆలయ ఈవో విజ్ఞప్తి చేశారు.
