కరోనా మహమ్మారిపై పోరాటానికి కేంద్రం ప్రభుత్వం “ఆరోగ్య సేతు” యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. యాప్ లాంచ్ చేసిన 13 రోజుల్లోనే 5 కోట్లకుపైగా డౌన్‌లోడ్స్‌తో రికార్డు సాధించింది. వల్డ్ వైడ్‌గా ఈ ఫీట్ సాధించిన ఫాస్టెస్ట్ ఎవర్ యాప్ ఇదే అని నీతి ఆయోగ్ CEO అమితాబ్ కాంత్ ప్రకటించారు. ఈ యాప్‌లో మరో రెండు ఫీచర్లను కేంద్రం చేర్చింది. ఒకటి ఈ-పాస్, రెండోది కొవిడ్-19 అప్‌డేట్స్.
కరోనా సోకిన వారి కదలికలను అబ్జర్వ్ చేసేందుకు, కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం కేంద్రం ఏప్రిల్ 2న ఈ యాప్‌ను ప్రారంభించింది. “ఆరోగ్య సేతు” ద్వారా చుట్టుపక్కల ఉన్న కరోనా రోగుల గురించి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రధాని మోడీ కూడా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సమయంలో పిలుపునిచ్చారు. దీంతో డౌన్‌లోడ్స్ ఒక్కసారిగా పెరిగాయి.
ఇతర యాప్‌లలాగే “ఆరోగ్య సేతు” యాప్ కూడా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇంగ్లీష్‌తో పాటు వివిధ భాషల్లో అందుబాటులో ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com