పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ల్యాబ్‌టెక్నీషియన్, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 22 పోస్టులకు రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు- 22
ల్యాబ్‌టెక్నీషియన్- 9 (జనరల్-4, బీసీ-1, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్-1)
అర్హతలు: బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిగ్రీ లేదా మెడికల్ ల్యాబొరేటర్ టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి.
వెటర్నరీ అసిస్టెంట్- 13 (జనరల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1)
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. యానిమల్ హస్బెండరీ లేదా పౌల్ట్రీ కోర్సులో రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
వయస్సు: 18 నుంచి 34 ఏండ్ల లోపువారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష
దరఖాస్తులు ప్రారంభం: జులై 28
దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 17
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you. https://startupclm.com/beatriz-crespo-startup-mas-innovadora/#comment-381